img.emoticon { padding: 0; margin: 0; border: 0; }

సృష్టిలో తీయనైనది...

Wednesday, April 6, 2011

అప్పుడప్పుడూ పెశాంతంగా బ్లాగులు తిరగేయ్యతమే తప్ప కుంచెం కూడా బొత్తిగా రాసే అలవాటు లేని  నాకు ఇవాళ మా సాయి కుమార్ చేసిన దివ్యోపదేశము దెబ్బకి ఇలాగ రాయాలనిపించింది.

"సృష్టిలో తీయనైనది గుంటూరు మిర్చి!"

కవి పరిచయం: ఈ వాక్యము ఫాస్టిన్ డానెగల్ రాసిన మిర్చి పురాణము అను గద్య భాగమునందలిది.

సందర్భము: మధురవాణి గారి కథను చదివినప్పుడు మిగిలిన రాజ్య సభ్యులతో కలిసి చెప్పిన సందర్భము లోనిది.

తాత్పర్యము: ప్రపంచంలో అన్నిటికన్నా స్వీట్ గా ఉండేది గుంటూరు మిర్చి.

నా మాటలు ఎప్పుడైతే విన్నాడో, అప్పుడు మా సాయి కుమార్ ప్రళయ కాల జుజ్ఝుల్లతా మేఘం లా విరుచుకు పడ్డాడు. కాస్త ఓడోమాస్ రాసి అరికాలికి కట్టు కట్టి తల నెప్పి ఏమన్నా ఉందా బాబూ అని డాడీ అడిగారు.

"ఎంత మదమెంత మాత్సర్యమెంత దిక్కారమెంత పొగరు...రేయ్ ఫాస్టినా! అన్నిటికన్నా తియ్యనైనది గుంటూరు మిర్చి అన్డువా? "

నాకు ప్యాంటు తడవటం మొదలైంది. జుట్టు వణకటం ప్రారంభించింది. కనీ వినీ ఎరుగని రీతిలో మా సాయి కుమారుడు రెండు కాళ్ళ పైనా నించుని 

ఇలా అన్నాడు, "ఫాస్టినా! సృష్టి యందు తియ్యనైనది గుంటూరు మిర్చి కాదు నాయనా"

అవునా? అని డాడీ ఆశ్చర్యంగా చూశారు. అంతలో అక్కడున్న గదిలో జనం అంతా మూర్చ పోయారు...

అప్పుడు సాయి కుమార్ తల చుట్టూ పెద్ద లైటు ఎలగటం  స్టార్ట్ అయ్యింది.

"అసలు సృష్టిలో తియ్యనైనది డబ్బు నాయనా... దాని సహాయం తో నీవేది ఐనను కొనుక్కోవచ్చు. మన సినిమాల్లో ప్రేమ ముఖ్యమని, నీతి కధల్లో ఇంకొటేదో ముఖ్యమనీ, 

ఇక్కడ మా శోభన్ బాబు అడ్డు తగిలాడు... "ఆ ఇంకొటేదో చెప్పండి స్వామీ"

కానీ మా సాయి కుమార్ కంటిన్యూ చేశాడు. "అంటారు కానీ డబ్బు ఉంటె మనకి దక్కనిది లేదు బిడ్డా..."

"అంటే ఏమిటి స్వామీ మీరు అనేది?" వాడి వీరావేశం చూసి దగ్గరకు వెళ్ళాలంటే భయం వేసింది. ప్పోలిసు స్టొరీ లో బాల కృష్ణ లా, సమర సింహా రెడ్డి లో విజయ్ కాంత్ లా ఉన్నాడప్పుడు. 

"నువ్వు చదివిన కథలో రాజకుమారి చెప్పిందని అందరు వంట గాళ్ళూ అలా ఉప్పు వెయ్యకుండా వంటలు చేసిండి  ఆ పిల్ల రాణి డబ్బుగలదనే కదా... అంతెందుకు ఈనాడు ఎంటెక్ చదివిన నువ్వు పనీ పాటా లేకుండా మిర్చి యార్డు పెట్టుక్కూచుంది డబ్బు పుష్కలంగా ఉండబట్టే కదా... నీకు ఇంతే తీపికావాలో డబ్బులు ఇచ్చి చెపితే చాలు ఫాస్టినా... డబ్బు తక్కువున్నప్పుడు నీవు అడిగినది దక్కదు. అదే, డబ్బు ఎక్కువున్నప్పుడు నీకేది కావాలంటే అది సలాములు ఒత్తి మరీ చేసి ఇస్తారు కదాశాపుల వాళ్ళు. మొన్న రేమండ్స్ కి వెళ్ళినప్పటి సంఘటన గుర్తు తెచ్చుకో...

చివరగా ఒక్క మాట, అతిగా కొటేషన్లు  చెప్పే పనివాడూ, అతిగా కథలు వినే యజమానీ బాగుపద్దట్టు చెరిత్రలో లేదు,"

ఓహో దివ్యోపదేశము దివ్యోపదేశము అనుకుంటూ స్పృహలోకి వచ్చేప్పటికి సాయంత్రమైంది 

Read more...

About This Blog

Lorem Ipsum

  © Blogger template Leaving by Ourblogtemplates.com 2008

Back to TOP